బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు వద్దు.. కాంగ్రెస్‌పై విమర్శలు

దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు వద్దు.. కాంగ్రెస్‌పై విమర్శలు

నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ స్థాయి AI సమ్మిట్ సందర్భంగా జరిగిన నిరసనలపై కేంద్ర కోల్ & మైన్స్ మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు. దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న వేళ ఇలాంటి కార్యక్రమాలను భంగం కలిగించడం తగదని అన్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా సమ్మిట్ నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలు, అంతర్జాతీయ ప్రతినిధుల భాగస్వామ్యం వంటి అంశాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని తెలిపారు. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో నిరసనలు సహజమేనని అంగీకరించిన ఆయన, ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరైన వేదికపై దేశ ఇమేజ్ దెబ్బతినేలా వ్యవహరించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని అభిప్రాయపడ్డారు. రాజకీయ లాభాల కోసం దేశ గౌరవాన్ని పణంగా పెట్టకూడదని స్పష్టం చేశారు.దేశాభివృద్ధిని ప్రతిబింబించే ఇటువంటి అంతర్జాతీయ వేదికల్లో హుందాతనం ప్రదర్శించడం అన్ని రాజకీయ పార్టీల బాధ్యత అని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి