బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.

జల్ జీవన్ మిషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి: జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.

విజయవాడ. ఫిబ్రవరి 24: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పనులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పథకం ఫలాలను ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ఈ సంద ర్భంగా మంగళవారం విజయవాడ కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావే శ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా జల, పారిశుద్ధ్య మిషన్ (డీడబ్ల్యూఎస్ఎం) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పురోగతితో పాటు స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్‌), ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణ వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలి. ఎ.కొండూరు మండలంలోని సీకేడీ ప్రభావిత ప్రాంతాల్లో ఇంటి కుళాయి కనెక్షన్ల భౌతిక స్థితిని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే, గొల్లమండల తండా, జమలగడ్డ, దీప్లానగర్ ఆవాసాలకు అవసరమైన క్లియర్ వాటర్ సంప్ నిర్మాణాన్ని పూర్తి చేసి, మార్చి నాటికి తాగునీటి సదుపాయం కల్పించాలని స్పష్టం చేశారు. జిల్లాలో 100 శాతం కనెక్షన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీపీవోకు సూచించారు.
వేసవి తాగునీటి సరఫరా పై అప్రమత్తత రానున్న వేసవి కాలంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిరంతరం నాణ్యమైన నీటిని సరఫరా చేసేలా చేతి పంపులు, బోర్‌వెల్స్‌కు మరమ్మతులు చేపట్టాల ని, పైపులైన్ల లీకేజీలను నివారించాలని ఆదేశించారు. స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాల సాధనలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా కీలక మని, నీటి నాణ్యత పర్య వేక్షణ కోసం పీహెచ్‌, టీడీఎస్‌, ఫ్లోరైడ్‌ వంటి పరామితులను పరీక్షించి ఫలితాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు.సమన్వయంతో పని చేయాలి. ఆరోగ్యం, విద్య, మహిళా & శిశు సంక్షేమ శాఖలతో సమ న్వయం చేసుకుంటూ పాఠశాలలు, అంగన్‌వాడీ లు, పీహెచ్‌సీలు, హాస్టళ్ల లోని నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుద్ధి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జెడ్‌పీ సీఈవో కె.కన్నమ నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏ.రామకృష్ణా రావు, డీపీవో పి.లావణ్య కుమారి, డ్వామా పీడీ ఏ.రాము, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్