Breaking News

టెన్త్ స్టూడెంట్స్‌కు అలర్ట్..

మార్చి 5న హాల్‌టికెట్లు విడుదల.

నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ ఏడాది హాల్‌టికెట్ల జారీ విధానంలో కొన్ని కొత్త మార్పులు చేయాలని నిర్ణయించింది.విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు, ముఖ్యంగా తల్లిదండ్రుల వాట్సాప్‌కు హాల్‌టికెట్లను నేరుగా పంపించనున్నారు. అదేవిధంగా అధికారిక వెబ్‌సైట్‌లో కూడా మార్చి 5న హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచనున్నారు. (అధికారిక వెబ్‌సైట్: https://bse.telangana.gov.in)

విజయ్–రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ఈసారి హాల్‌టికెట్‌పై క్యూఆర్ కోడ్ ముద్రించనున్నారు. విద్యార్థులు స్మార్ట్‌ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే గూగుల్ మ్యాప్ ద్వారా నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లే మార్గాన్ని తెలుసుకోవచ్చు.పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,512 మంది ప్రైవేట్ విద్యార్థులు కలిసి మొత్తం 5,28,238 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. గతేడాదితో పోలిస్తే సుమారు 20 వేల మంది అదనంగా పరీక్షలు రాస్తున్నారు.విద్యార్థుల సంఖ్య పెరగడంతో పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచారు. ప్రతి పరీక్షా కేంద్రంలో క్లోక్‌రూం సదుపాయం కల్పిస్తూ, విద్యార్థులు తమ బ్యాగులను సురక్షితంగా ఉంచుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి నిర్ణయంతో ఉద్యోగ సంఘాల ఆనందం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *