బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం: సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు

పండుగ వాతావరణంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం: సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు

నేటి తెలుగు పత్రిక: ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 26వ తేదీ అనగా రేపటి నుండి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందనీ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ గారు తెలిపారు. బుధవారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం పనిచేసే వారిని ఉద్యమి, సాదక్, ప్రదాతలుగా వర్గీకరించి పార్టీ బలోపేతం కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం తొలి సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఫిబ్రవరి 26వ తేదీ నుండి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆదేశాలతో జిల్లాలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పక్క ప్రణాళికాలతో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఉద్యమి సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో జనసైనికులు ప్రజలకు వివరించాలని తెలిపారు. జనసేన సభ్యత్వం రుసుము కూడా 400 రూపాయలేనని అన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా తో పాటు నాయకుడిగా ఎదిగే అవకాశాలు, సబ్ పార్టీ సభ్యత్వం ఉన్నవారికి మాత్రమే కమిటీల్లో బాధ్యతలు ఉంటాయని, పార్టీ కార్యక్రమాల్లో గుర్తింపుతో పాటు గౌరవం, ప్రాధాన్యత ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ బలోపేతానికి ఈ సభ్యత్వం కార్యక్రమం ఖచ్చితంగా దోహదపడుతుందన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి