బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే

రాష్ట్ర భ‌విత మీరే..చ‌రిత మీదే
  • అమ్మ‌లాంటి తెలుగు భాష‌ను మ‌ర‌వొద్దు.
  • అసెంబ్లీ లాబీలో విద్యార్థుల‌తో విద్యా మంత్రి లోకేష్ సంభాష‌ణ‌.

నేటి తెలుగు పత్రిక: పిల్ల‌లే రాష్ట్ర భ‌విత అనీ, రాబోయే కాలంలో చ‌రిత్ర సృష్టించేది నేటి విద్యార్థులేన‌ని, ఇంగ్లీషులో చ‌దువుకుంటున్నా, అమ్మ‌లాంటి తెలుగుభాష‌ను మ‌రువొద్ద‌ని విద్యా మంత్రి నారా లోకేష్ సూచించారు. అసెంబ్లీ చూడటానికి బుధ‌వారం వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థుల‌తో లాబీలో మంత్రి మాట్లాడారు. అసెంబ్లీ చూడ‌టం ఎలా వుంది? మీరు చూస్తున్న‌ప్పుడు అసెంబ్లీలో ఏ అంశంపై చ‌ర్చ జ‌రిగింది? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీ కార్య‌క‌లాపాలు ప్ర‌త్య‌క్షంగా చూడ‌టం వ‌ల్ల చాలా విష‌యాలు తెలిశాయ‌ని, తాము చూసిన చ‌ర్చ‌ను లోకేష్‌కు వివ‌రించారు. కెరీర్, ఎడ్యుకేష‌న్ కోసం ఇంగ్లీషులో నైపుణ్యం క‌న‌బ‌రుస్తూనే.. మాతృ భాష తెలుగును మర్చిపోవద్ద‌ని పిల్ల‌ల‌కు హిత‌బోధ చేశారు. విదేశాల్లో ఎక్కువ కాలం చదువుకోవడం వలన మొద‌ట్లో తెలుగు రాక తాను ఇబ్బంది ప‌డిన విష‌యాన్ని విద్యార్థుల‌తో పంచుకున్నారు. ప్ర‌భుత్వం ఇస్తున్న యూనిఫామ్ ఎలా ఉంది? టీచర్లు పాఠాలు ఎలా చెబుతున్నారు? మధ్యాహ్నం భోజనం రుచిగా ఉంటుందా? రాగిజావ అందుతోందా? అని అడిగి తెలుసుకున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్