బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష‍.

శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష‍.

నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్రంగా ఆరా తీశారు.శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో సీరియస్ పరిస్థితిలో చికిత్స పొందుతున్న ఇద్దరి గురించి ప్రత్యేకంగా విచారించారు. ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా, మరొకరికి డయాలసిస్ అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. వీరి చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతం 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఇద్దరు మినహా మిగతా వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.అలాగే రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, పాల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.ప్రజారోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్