బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

వెంకటపూర్‌లో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ విజయవంతం

వెంకటపూర్‌లో టీఆర్‌పీ జెండా ఆవిష్కరణ విజయవంతం

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు తుర్కపల్లి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ “తీన్మార్ మల్లన్న” ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, యువత భారీగా హాజరై కార్యక్రమానికి విశేష స్పందన వ్యక్తం చేశారు.టీఆర్‌పీ జెండా ఆవిష్కరణతో గ్రామంలో పార్టీ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామ స్థాయిలో బలమైన వేదికగా టీఆర్‌పీ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తమైంది.ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజల మద్దతే పార్టీకి అసలైన బలం అని, గ్రామాల నుంచే మార్పు ప్రారంభమవుతుందని తెలిపారు. వెంకటపూర్‌లో కనిపించిన స్పందన భవిష్యత్‌లో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ గారు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ బందారపు నర్సయ్య గౌడ్ , ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్రిశెట్టి నర్సింహులు , మాజీ జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ బిక్కు నాయక్ , నాయకులు మోత్కుపల్లి రఘు , శ్రీనివాస్ మరియు వెంకటపూర్ గ్రామ టీఆర్‌పీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి