బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

మెగాస్టార్ చిరంజీవి – నయనతార – వెంకటేష్ కలిసి నటించిన సినిమా టీవీలో

మెగాస్టార్ చిరంజీవి – నయనతార – వెంకటేష్ కలిసి నటించిన సినిమా టీవీలో

విజయవాడ, 25 ఫిబ్రవరి,నేటి తెలుగు పత్రిక: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు మళ్లీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనుంది. హిట్ మేకర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ హై-ఆక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేట్రికల్ రన్‌లో భారీ వసూళ్లు సాధించి, విస్తృత ప్రశంసలు అందుకుంది. మన శంకర వరప్రసాద్ గారు గ్రాండ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఫిబ్రవరి 28, శనివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన మన శంకర వరప్రసాద్ గారు ఫిబ్రవరి 11 నుంచి డిజిటల్ ప్లాట్‌ఫాం జీ5(ZEE5) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మితా కొణిదెల సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించగా, నయనతార, వెంకటేష్ దగ్గుబాటి, కెథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.భీమ్స్ సెసిరోలియో సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం, తమ్మిరాజు ఎడిటింగ్‌తో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా మారింది. హృదయస్పర్శక కుటుంబ భావాలు, నవ్వులు పూయించే కామెడీ, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఆత్మీయ ప్రదర్శనలతో అన్ని వయసుల ప్రేక్షకులకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా నిలిచింది. డిజిటల్ వేదికపై కూడా సెన్సేషన్ సృష్టించిన ఈ చిత్రం జీ5లో సంచలనాత్మకంగా 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను సాధించి ప్రేక్షకాదరణను మరింతగా చాటుకుంది. మెగా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాని జీ5, జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూసేయండి.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?