బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

నేటి తెలుగు పత్రిక: ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో నడిచే ఏసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన కొత్త ఛార్జీలు మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రయాణికులు ఏసీ బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే అధిక టికెట్ ధరల కారణంగా కొందరు ప్రయాణాన్ని తగ్గిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భారం తగ్గించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి?

  • మెట్రో డీలక్స్ ఏసీ బస్సుల్లో గతంలో ప్రతి నాలుగు కిలోమీటర్లకు రూ.30 ఉండగా.. ఇప్పుడు రూ.25కి తగ్గించారు.
  • ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో నాలుగు కిలోమీటర్లకు గతంలో రూ.35 ఉండగా.. ప్రస్తుతం రూ.25కి తగ్గించారు.

దీంతో ఒక్కో ప్రయాణానికి రూ.5 నుంచి రూ.10 వరకు ఆదా కానుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎంత దూరానికి ఎంత తగ్గింపు?

  • 1–3 కిమీ వరకు: రూ.5 నుంచి రూ.10 వరకు ఆదా
  • 4–15 కిమీ వరకు: మెట్రో డీలక్స్‌లో రూ.5–10, ఈ-మెట్రోలో రూ.10–15 తగ్గింపు
  • 16–21 కిమీ వరకు: రూ.10–15 వరకు ఆదా
  • 22–30 కిమీ వరకు: రూ.5–10 వరకు తగ్గింపు

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 275 మెట్రో డీలక్స్, 90 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ఛార్జీల తగ్గింపుతో సమ్మర్ సీజన్‌లో ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది.