బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్,నేటి తెలుగు పత్రిక: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి పొంగులేటిని టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీ.ఓ 252, జీ.ఓ 103లో కేబుల్ ఛానల్స్ కు అక్రెడిటేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టుకు అక్రెడిటేషన్స్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందివద్దని మంత్రి భరోసా ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, సిటీ కేబుల్ ఎం.డి శివరామ కృష్ణ, ఎం.ఎస్ ఓ సంఘం నాయకులు వంగా శ్రీనివాస్ రెడ్డి, కేబుల్ చానెల్స్ జేఏసీ నాయకులు కడకంచి వెంకటేష్, హెచ్ వి.చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేష్ తదితరులు ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి