Breaking News

సింగపూర్ కిట్స్ కాలేజీలో ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా సదస్సు

  • గత ఏడాది కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది మృతి, ఆందోళన వ్యక్తం చేసిన సీపీ

కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వాటిని బాధ్యతాయుతంగా పాటించినప్పుడే ప్రమాద రహిత సమాజం సాధ్యమవుతుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం అన్నారు.రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం సింగపూర్ కిట్స్ కళాశాల నందు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ‘అరైవ్ – అలైవ్’ (ARRIVE – ALIVE) అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీపీ ప్రసంగిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. ప్రాణనష్టానికి అతివేగం , నిర్లక్ష్యం మరియు మానవ తప్పిదాలే కారణం: గత ఏడాది కమిషనరేట్ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని సీపీ అన్నారు. ఇందులో ఎక్కువ శాతం ప్రమాదాలు సీట్ బెల్టు ధరించకపోవడం, హెల్మెట్ లేకపోవడం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనం నడపడం వంటి మానవ తప్పిదాల వల్లే జరిగాయని తెలిపారు.

85 శాతం బాధితులు పురుషులే: ప్రమాదాల్లో మరణించిన వారిలో 85 శాతం మంది పురుషులు ఉండటం గమనార్హమని, అందులోనూ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరితో రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులకు సహకరించి, వారితో పాటు ఎన్నికల విధులు నిర్వహించినందుకుగాను ఎన్ సి సి క్యాడెట్లకు ప్రశంసా పత్రాలను సీపీ చేతుల మీదుగా అందించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ సమన్వయంతో పోలీసుల తరుపున లైసెన్స్ దరఖాస్తు చేయించామని వారికి లెర్నింగ్ లైసెన్స్ కూడా అందజేశామన్నారు.

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో కలిసి పిన్న వయస్కుడైన కార్పోరేటర్ గుణకు ఆశీస్సులు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ వేణు , హుజురాబాద్ ఏసీపీ మాధవి , హుజురాబాద్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, వెంకట్ , లక్ష్మీనారాయణ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె శంకర్ , ఎస్సైలు శేఖర్ రెడ్డి , స్వాతి కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

టికెట్ రేట్లు తగ్గించిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *