Breaking News

చిట్టూరి హైస్కూల్లో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శన కార్యక్రమం..!

విజయవాడ, ఫిబ్రవరి 27: సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ లోని చిట్టూరి హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం, సైన్స్ సమగ్ర మహో త్సవ 2K 26 నిర్వహిస్తున్నట్లు చిట్టూరి హై స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డి. సుజాత చెప్పారు. ఈ సందర్భంగా గురువారం స్కూల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4500 పాఠశాలల నుంచి 30 వేల మంది విద్యార్థులతో ఒకే సమయంలో సైన్స్ పోటీలు నిర్వహించారని వీటిలో ఫైనల్ దశకు ఎంపిక చేసిన 30 ప్రాజెక్టులతో శుక్రవారం ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరిలో విజేతలకు అదే రోజు బహుమతి ప్రధానం చేస్తామని అన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్ర క్చర్, ఇన్వెస్ట్మెంట్ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, పార్ల మెంటు సభ్యులు, కేశినేని శివనాద్, శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎం. టి కృష్ణ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మిషా, జాయింట్ కలెక్టర్ యిలక్కియ అతిధులుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేసినేని వెంకటేశ్వర్లు మొత్తం కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నట్లు చెప్పారు. స్కూల్ ప్రిన్సిపల్ పి. హారిక మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు పెంచాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్కూల్ ట్రెజరర్ మాడుగుల వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 30 ప్రాజెక్టులతో విద్యార్థులు ప్రదర్శన ఏర్పాటు చేస్తామన్నారు. సాంస్కృతిక ప్రదర్శన అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రధానం జరుగుతుందని అన్నారు.

విజయవాడలో పీఎంజే జువెల్స్ గ్రాండ్ ఎగ్జిబిషన్: ప్రపంచంలోనే అతిపెద్ద జ్యువెలరీ ప్రదర్శన.

పడవల పునరాగమనం.. మత్స్యకారుల ఆశలకు కొత్త ఆరంభం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *