సూర్యాపేట: ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): అమెరికా సామ్రాజ్యవాదం భారత్ కు హాని చేస్తుందని దేశంలో మోడీ ప్రభుత్వం చేతకానితనం మూలంగానే దేశ మార్కెట్ ను కబలించేందుకు అమెరికా ప్రయత్నం చేస్తుందనిసిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గo సమావేశంలో ఆమె మాట్లాడుతూదేశంలో బిజెపి ఆధీనంలోని మోడీ ప్రభుత్వం రైతాంగ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెట్టిందని విత్తన చట్టంతో అమెరికాకు లాలూచీ పడుతుందని ఇది సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. ప్రపంచాన్ని ట్రంప్ బెదిరిస్తున్నాడని పేరు చెప్పకుండా భారత్ ను ఆంక్షలు విధిస్తున్నాడని విమర్శించారు. భారతదేశంలో అమెరికా ఉత్పత్తులను అమ్ముకునేందుకు వీలు లేకుండా అడ్డుకున్నందుకు 25% జరిమాన వేశాడని, అమెరికాలో మనం వస్తువులు అమ్ముకోవడానికి వెళ్తే మరో 25% సుంకాల విధిస్తున్నాడని రష్యా వద్ద పెట్రోల్ ఉత్పత్తులు కొనకుండా బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఈ విధానాలకు మోడీ ప్రభుత్వం తల వంచిందని విమర్శించారు. అదాని అంబానీ లకు మేలు చేయడం కోసమే మోడీ ప్రభుత్వం అమెరికాకు తలగ్గిందని దుయ్యబట్టారు. భారత్ పై అమెరికా విధించిన సుంకాలకు వ్యతిరేకంగా మోడీ ప్రశ్నించకపోవడంతో అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించి భారతపై విధించిన సుంకలను రద్దు చేయించారని అన్నారు.
అమెరికా ధాన్యం, పాలు కూరగాయలు భారత్ మార్కెట్లో విక్రయిస్తే దేశ రైతుల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ట్రంపు సుంకాలు 18 శాతానికి తగ్గించాడని బిజెపి అంటుందని ఇది వాస్తవం కాదని ట్రంప్ అధికారంలోకి రాకముందు కేవలం మూడు శాతమే భారతపై సుంకాలు ఉండగా ఇప్పుడిది 18 శాతానికి పెరిగిందని అన్నారు. భారత ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం అమెరికాకు తాకట్టు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా రౌడీయిజాన్ని మోడీ ఖండించలేదని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయని అన్నారు. అమెరికాకు మోడీ అమిత్ షాలు దాసోహం అయ్యారని విమర్శించారు. మోడీ అమిత్ షాలు భారత్ భక్తులు కాదని అమెరికా ట్రంప్ భక్తులు అని ఎద్దేవా చేశారు. దక్షిణ అమెరికాలో వామపక్ష గాలి వీస్తుందని అమెరికా తట్టుకోలేకపోతుందని అందుకే సోషలిస్టు దేశాలపై ఆగ్రహం పెంచుకుంటుందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా సమస్యలు పెరుగుతున్నాయని ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయని యువత తిరుగుబడుతుందని శ్రీలంకలో యువత తిరుగుబడడంతో ఎర్రజెండా అంది పుచ్చుకొని అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఎర్రజెండా విస్తరించకపోవడంతో తిరుగుబాటును అమెరికా తనకు అనుకూలంగా మార్చుకుంటుందని వాడుకుంటుందని అన్నారు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తిరగబడే యువతకు ఎర్రజెండా అండదండగా ఉంటుందని అన్నారు. అలాగే దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎర్రజెండా విస్తరించాలని ప్రజా ఉద్యమాలను అందిపుచ్చుకొని ఎర్రజెండా ఎగరవేగాలని అన్నారు. ప్రజా ఉద్యమాల్లో ఎర్రజెండా లేకుంటే మతోన్మాదులు ప్రాంతీయవాదులు చొరబడుతున్నారని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పై అసంతృప్తి పెరగడంతో ఎర్రజెండా బలహీనంగా ఉండడంతో బిజెపి అందిపుచ్చుకొని అధికారంలోకి వచ్చిందని అన్నారు. కమ్యూనిస్టులు బలహీన పడటంతో నిరంకుశ ఫాసిస్ట్ శక్తులు బలపడుతున్నాయని నయా ఫాసిస్టు లక్షణాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని పార్లమెంట్ ప్రజా సమస్యలు చర్చకు రావడం లేని మోడీ తనకు అనుకూలమైన బిల్లులు పాస్ చేయించుకొని పార్లమెంటు మూసేస్తున్నాడని విమర్శించారు. బిజెపి విధానాలను వ్యతిరేకించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు.
ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కాంగ్రెస్ కూడా ముందుకు రావడంలేదని అది కూడా రేపు అధికారంలోకి వస్తే అదాని అంబానీలకు సేవ చేయాల్సి వస్తుందని విమర్శించారు. దేశంలో కార్మికులు 150 ఏళ్లుగా సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ పార్లమెంట్ వేదికగా రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికుల భవిష్యత్తును బుగ్గిపాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ విత్తన చట్టం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉందని విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దివాలా తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా ఉపాధి హామీ చట్టాన్ని నేరుగార్చారని పేద కూలీల పొట్ట కొడుతున్నారని కూలీలను మభ్యపెట్టి రాముని పేరుతో భజన చేస్తున్నారని ఈ విషయంలో కాంగ్రెస్ స్పందించకపోవడం శోచనీయమన్నారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ను గృహాలకు పేదలకు దళిత గిరిజనులకు ఉచిత విద్యుత్ను రద్దు చేసేందుకే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారని ఇది రైతాంగం మనుగడకు ముప్పని అన్నారు. అను విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటుపరం చేసి దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకే శాంతి బిల్లు తెచ్చారని ఇది ప్రమాదకరమైన ది అన్నారు అను విద్యుత్ ఉత్పత్తిలో ప్రమాదాలు జరిగితే దేశంలో ఎంతో మంది ప్రజలు నష్టపోతారని వికలాంగులు అవుతారని అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో బిజెపి ప్రభుత్వం ముందుకు వస్తుందని దేశ ప్రయోజనాలను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రజలను మభ్య పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఒకే దేశం ఒకే రాష్ట్రం ఒకే మతం పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది దేశ ప్రయోజనాలను విఘాతం అని అన్నారు.
దేశంలో రాష్ట్రంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యతిరేకించాలని ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ పొత్తు ఆత్మహత్య సదృశ్యమని తద్వారా టిఆర్ఎస్ కు తీరని నష్టం జరుగుతుందని బిఆర్ఎస్ ను మింగేయాలి బిజెపి చూస్తుందని అన్నారు. దేశంలో సర్వేల పేరుతో ముందుకు వచ్చిన బిజెపి ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో బిజెపికి ఓటు వేయని వారిని గుర్తించి ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తుందని ఇది పచ్చి నియంతృత్వం అని అన్నారు. తద్వారా తమ ఓటును నిరూపించుకునేందుకు ప్రజలు అనేక పాటు పడాల్సి వస్తుందని అన్నారు. తద్వారా ముస్లింలు ఓటు హక్కు కోల్పోతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 50, 60 శాతం పెట్రో ముడి చమురు ధరలు తగ్గిన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదని అన్నారు. దేశ ప్రజల జేబులను మోడీ లూటీ చేస్తున్నాడు అని విమర్శించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టి పెళ్లి సైదులు కోట గోపి పాల్గొన్నారు.
