బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో భారీ కార్యక్రమం

ఏపీలో ఇళ్ల కోసం వేచి చూస్తున్న వారికి శుభవార్త.. వచ్చే నెలలో భారీ కార్యక్రమం

నేటి తెలుగు పత్రిక: ఏపీలో ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుక అందించేందుకు సిద్ధమైంది. పేదలకు ఇళ్ల మంజూరు, పంపిణీ కార్యక్రమాలకు ముహూర్తం ఖరారు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది రోజున ఇళ్ల పంపిణీ

మార్చి 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అర్హులైన వారికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం అయిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఉగాది రోజున కొత్త ఇళ్ల నిర్మాణానికి అనుమతి పత్రాలు పంపిణీ చేయనున్నారు.అదే రోజున ఆంధ్రప్రదేశ్ టౌన్‌షిప్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) ఇళ్లలో లక్ష యూనిట్లను లబ్దిదారులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

టిడ్కో ఇళ్లకు గ్రీన్ సిగ్నల్

2014లో తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభమైన టిడ్కో ఇళ్ల నిర్మాణం తరువాత నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేసి అందించేందుకు చర్యలు వేగవంతం చేసింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  • 40,500 మందికి ఇళ్ల పంపిణీకి బ్యాంకుల నుంచి రూ.1354 కోట్ల రుణాలు
  • ఉగాది నాటికి లక్ష ఇళ్ల పంపిణీ లక్ష్యం
  • త్వరలో నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహణ

5 లక్షల గృహప్రవేశాల లక్ష్యం

ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.మరోవైపు, విశాఖలోని కైలాసగిరి పై భారీ త్రిశూలాన్ని ఆవిష్కరించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొత్తానికి ఉగాది పండుగను పురస్కరించుకుని ఇళ్ల మంజూరు, పంపిణీతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందిస్తోంది.