Breaking News

విద్యాశాఖలో ‘బదిలీల’ మాఫియా

మొద్దు నిద్రలో కాంగ్రెస్ సర్కార్?

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇందిరా కాలనీ , బీసీ కాలనీ ఈ యాదగిరిపాల్లో.. వీటన్నిటిని రెగ్యులర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలలి

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖను అవినీతికి అడ్డాగా మార్చేసింది.

కోదాడ ,మార్చ్4( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్‌లో వెలుగుచూసిన ఉపాధ్యాయుల ‘రివర్షన్’ బదిలీల వ్యవహారం చూస్తుంటే ప్రభుత్వానికి పారదర్శకతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో,విద్యాశాఖలో పోస్టింగ్‌లను అధికారులు సంచిలో వేసి సంతలో అమ్ముకుంటున్నట్లు పత్రికల్లో కార్టూన్లు వచ్చే స్థాయికి వ్యవస్థ దిగజారిందంటే, విద్యాశాఖ మంత్రి,స్థానిక పాలకులకు సిగ్గనిపించడం లేదా? అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఎద్దేవా చేశారు.నిబంధనల ప్రకారం పనిచేసే ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంలో ముందుండే అధికారులు,లక్షల రూపాయల చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్న ‘రివర్షన్’ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారనీ?

బొమ్మలరామారంలో ఘనంగా హోలీ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

పైరవీకారులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు ఇస్తే, నిబంధనల ప్రకారం మారుమూల గ్రామాల్లో సేవలందిస్తున్న నిజాయితీ గల ఉపాధ్యాయులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది?ఈ అక్రమ బదిలీల వ్యవహారంపై,ప్రభుత్వం వెంటనే స్పందించాలనీ సిట్టింగ్ జడ్జితో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలనీ, మల్లయ్య యాదవ్ కోరారు.ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న అధికారులపై, నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలనీ లేనిపక్షంలో అక్రమంగా జరిగిన ప్రతి బదిలీని రద్దు చేసి బాధిత ఉపాధ్యాయులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదనీ,బిఆర్ఎస్ ఆధ్వర్యంలో అవసరమైతే కలెక్టర్ కార్యాలయం సహా సంబంధిత కార్యాలయాలను ముట్టడించే కార్యక్రమాలు చేపడతాం అని, బి.ఆర్.ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి , కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లంమల్లయ్య యాదవ్ హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *