బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

ఏపీ టెన్త్ హాల్‌టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో కూడా సులభంగా డౌన్‌లోడ్ చేసే అవకాశం

అమరావతి, మార్చి 5, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను పాఠశాల ప్రిన్సిపల్‌ల ద్వారా నేరుగా పొందవచ్చు.

అదే విధంగా హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 కు ‘Hi’ అని మెసేజ్ పంపితే విద్యార్థులు తమ హాల్‌టికెట్లను పొందవచ్చు. అలాగే బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్, పాఠశాల విద్యాశాఖ లీప్ యాప్ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఒకే షిఫ్టులో నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్ తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పరీక్షల షెడ్యూల్

  • మార్చి 16 – ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 18 – సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 – ఇంగ్లిష్
  • మార్చి 23 – మ్యాథమెటిక్స్
  • మార్చి 25 – ఫిజికల్ సైన్స్
  • మార్చి 28 – బయాలజికల్ సైన్స్
  • మార్చి 30 – సోషల్ స్టడీస్

విద్యార్థులు ముందుగానే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.