బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

‘తల్లికి వందనం’పై మంత్రి లోకేష్ క్లారిటీ.. అర్హులందరికీ సాయం అందిస్తాం

అమరావతి, Mar 06, 2026, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తల్లికి వందనం పథకం పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు మొత్తం రూ.8,454 కోట్ల మేర సాయం అందించినట్లు వెల్లడించారు.

విద్య కోసం ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (యూడైస్) ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు 79,51,903 మంది విద్యార్థులు నమోదై ఉన్నారని తెలిపారు. వీరిలో అర్హత ఉన్న వారిలో సుమారు 84 శాతం మందికి తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించామని మంత్రి పేర్కొన్నారు.అర్హత ఉన్నప్పటికీ సాయం అందని వారు ఉంటే వారి వివరాలు ఇవ్వాలని లోకేష్ కోరారు. అటువంటి సమస్యలను పరిశీలించి అర్హులందరికీ సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.విద్యార్థుల చదువుకు ఆర్థిక భారం తగ్గించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్