Breaking News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డెలావర్ గవర్నర్.. కీలక అంశాలపై చర్చ

హైదరాబాద్‌,mar 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిను అమెరికాలోని డెలావేర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా డెలావర్ రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు, రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. భవిష్యత్తులో తెలంగాణ మరియు డెలావర్ రాష్ట్రాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే తెలంగాణ ప్రతినిధుల బృందంతో కలిసి డెలావర్ రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఈ సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌కు **‘తెలంగాణ–2047 విజన్ డాక్యుమెంట్’**ను అందజేశారు. సమావేశంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *