బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌.. 12న ప్రారంభం

నిరుద్యోగులకు కొత్త అవకాశాలు.. డిజిటల్ కంటెంట్ హబ్‌గా హైదరాబాద్‌.. 12న ప్రారంభం

హైదరాబాద్‌,mar 07,నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు తెరుచుకోనున్నాయి. అంతర్జాతీయ ఓటీటీ కంటెంట్, విజువల్ ఎఫెక్ట్స్ రంగంలో పనిచేస్తున్న Netix Studios హైదరాబాద్‌లో భారీ కార్యాలయాన్ని ప్రారంభించనుంది. సుమారు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని ఈ నెల 12న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొననున్నారు.భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఈ విస్తరణ చేపడుతోంది. ఇప్పటికే Mumbaiలో కార్యాలయం నిర్వహిస్తున్న నెటిక్స్ స్టూడియోస్‌కు, Hyderabad కేంద్రం దేశంలో రెండో ప్రధాన కార్యాలయంగా నిలవనుంది.

ఈ పెట్టుబడితో నగరంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.అడ్వాన్స్‌డ్ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాల ద్వారా AVGC రంగంలో నైపుణ్యాభివృద్ధికి కూడా ఊతం లభించనుంది. హైదరాబాద్‌ను డిజిటల్ కంటెంట్ తయారీ కేంద్రంగా మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రస్తుతం హైదరాబాద్‌లో అనేక అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. హాలీవుడ్ సినిమాలకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. Warner Bros., The Walt Disney Company, Electronic Arts, Ubisoft వంటి సంస్థలు ఇప్పటికే నగరంలో పనిచేస్తున్నాయి.అదేవిధంగా హాలీవుడ్ సినిమాల్లో విస్తృతంగా ఉపయోగించే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరంలోని Annapurna Studiosలో ఏర్పాటు చేసిన ‘ఎం అండ్ ఎం క్యాప్ ల్యాబ్’ ఈ రంగానికి కొత్త అవకాశాలను తీసుకొస్తోంది.