బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
సినిమా

అల్లు శిరీష్ పెళ్లిలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న పొలేనా అంజనా

అల్లు శిరీష్ పెళ్లిలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు.. క్యూట్ లుక్‌తో ఆకట్టుకున్న పొలేనా అంజనా

Mar 07, నేటి తెలుగు పత్రిక: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలేనా అంజనా కొణిదెల సాధారణంగా పబ్లిక్‌లో చాలా అరుదుగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. అయితే తాజాగా ఆమె అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ – నయనికా రెడ్డి వివాహం శుక్రవారం (మార్చి 7) రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు మెగా ఫ్యామిలీ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ వేడుకకు చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కొణిదెల సుస్మిత తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.

అయితే ఈ వేడుకలో పవన్ కల్యాణ్ చిన్న కూతురు పొలేనా అంజనా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ దుస్తుల్లో అచ్చమైన తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇటీవల పవన్ కల్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాలుకు వెళ్లినప్పుడు ఆమె కనిపించింది. ఆ తర్వాత మళ్లీ పబ్లిక్‌లో కనిపించడం ఇదే మొదటిసారి.

పెళ్లి వేడుకలో పవన్ కల్యాణ్ వెంటే నడుస్తూ వచ్చిన అంజనా, చిరంజీవిను చూసిన వెంటనే “హాయ్ పెదనాన్న” అంటూ పలకరించింది. మెగాస్టార్ కూడా ఆమెను ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.మొత్తానికి అల్లు శిరీష్ – నయనికా రెడ్డి వివాహ వేడుకలో పొలేనా అంజనా కొణిదెల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా, “చాలా క్యూట్‌గా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?