Breaking News

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 9 నుండి ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

9వ తేదీ నుండి ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర మహిళ, పురుష అభ్యర్థులకు
  • నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగంలో ఎంపిక

గుంటూరు, మార్చి 7,నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి యంత్రాంగం సిద్ధమైంది. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను ఇప్పటికే జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చును. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. మార్చి 9, 10 తేదీలలో బాలికలకు., మార్చి 12,13 తేదీలలో ఆంధ్ర ప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 2005 జూలై 2 నుండి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు.కనీస ఎత్తు 152 సెం.మీ. (స్త్రీ మరియు పురుషులు), ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా 2 సంవత్సరాల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణత కలిగిన విద్యార్హత ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం మరియు ఇంగ్లీషులో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.

16న పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

అభ్యర్థులు ఎలాంటి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా ర్యాలీ కీ హాజరు కావచ్చని తెలిపారు. ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధృవపరిచిన విద్యార్హత సర్టిఫికేట్లు (X మరియు XII పాసైన సర్టిఫికేట్లు లేదా తత్సమాన విద్యార్హత సర్టిఫికేట్లు), నివాస ధృవీకరణ (డొమిసైల్ సర్టిఫికేట్),ఎన్.సి.సి సర్టిఫికెట్ (ఒక వేళ ఉంటే),ఆధార్ కార్డ్, ఈ-మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, ఇటీవలి తీసుకున్న 10 కాపీలు పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలు,  ప్రతి సర్టిఫికెట్ కు సంబంధించిన 6 జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు.

ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ మహిళ అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరు కావాలని కోరారు.1.6 కిలో మీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందని చెప్పారు. రాత పరీక్షకు ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుందని, ఒక తప్పు జవాబుకు పావు మార్కు తీసివేయడం జరుగుతుందని చెప్పారు.

“ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా జిల్లాలో ‘కార్డన్ అండ్ సెర్చ్’: విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *