Breaking News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్

మార్చి 12(నేటి తెలుగు పత్రిక): ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్లను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే అందుబాటులోకి వచ్చేలా రూపొందిస్తున్నారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటికే సాంకేతికత ఆధారంగా సేవలు అందించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ స్మార్ట్ కార్డ్ వ్యవస్థను కూడా తీసుకురానుంది.

ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్‌లో ఉండే వివరాలు

ఈ కార్డులో కుటుంబ సభ్యులకు సంబంధించిన అనేక వివరాలు ఉంటాయి.

  • కుటుంబ సభ్యుల వ్యక్తిగత సమాచారం
  • ఆధార్ నెంబర్
  • రేషన్ కార్డు వివరాలు
  • ఫ్యామిలీ ఐడి
  • మొబైల్ నెంబర్లు, అడ్రస్
  • విద్యా సమాచారం
  • వృత్తి, ఆర్థిక పరిస్థితి
  • ఆస్తి వివరాలు
  • పొందుతున్న ప్రభుత్వ పథకాల సమాచారం

ఈ సమాచారాన్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా అధికారులు సులభంగా యాక్సెస్ చేయగలుగుతారు.

రెండు పెళ్లిళ్లు.. బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. చివరికి అరెస్ట్

ఒక్క కార్డుతో ప్రభుత్వ సేవలు

ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో వేర్వేరు డాక్యుమెంట్లు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఒక్క కార్డు ఉంటే చాలు పలు ప్రభుత్వ సేవలను పొందే అవకాశం ఉంటుంది.

ఇంటింటికి డేటా సేకరణ

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం 26 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 82 శాతం కుటుంబాల వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు.

త్వరలో కార్డుల పంపిణీ

ఏప్రిల్ 30 నాటికి 90 శాతం డేటా నమోదు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం కార్డులను ప్రింట్ చేసి ప్రతి కుటుంబానికి పంపిణీ చేయనున్నారు. అవసరమైతే కార్డులోని వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించనున్నారు.ఈ కొత్త ఫ్యామిలీ స్మార్ట్ కార్డ్ వ్యవస్థతో ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత తీవ్ర విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *