Breaking News

సీఏలో ప్రతిభ చాటిన భవ్యస్ ను సత్కరించిన ఆకుల గాంధీ తదితర ప్రముఖులు

మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): ఖమ్మం నగరంలోని 17వ డివిజన్ శ్రీనివాస నగర్ వాస్తవ్యులు, మున్నూరుకాపు సంఘం ప్రముఖులు కూరాకుల మోహన్-లలిత దంపతుల కుమారుడు భవ్యస్ చార్టెడ్ అక్సౌంటెంట్ (సీఏ) పరీక్షలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.ఈ సందర్భంగా ఆయన్ను గురువారం సాయంత్రం మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ,సంఘం ప్రముఖులు శాలువాలతో సత్కరించి అభినందించారు, ఆశీస్సులు అందజేశారు.భవ్యస్ గత నెల (ఫిబ్రవరి) 11వతేదీన ప్రకటించిన కాస్ట్ మేనేజ్మెంట్ అక్సౌంటెంట్ (Cost Management Accountant-CMA)పరీక్షల్లో జాతీయ స్థాయిలో 25వ ర్యాంక్, మార్చి 8వతేదీన విడుదలైన సీఏ (చార్టెడ్ అక్సౌంటెంట్-CA Inter)పరీక్షల్లో ఆలిండియా 39వ ర్యాంక్ సాధించారు.ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, సంఘం 17వ డివిజన్ గౌరవాధ్యక్షులు ఆకుతోట రాజశేఖర్, అధ్యక్షులు పగడాల మోహన్ రావు,కార్యదర్శి ముత్యం కొండల్ రావు, ఉపాధ్యక్షులు పద్మం వెంకటేశ్వర్లు, కోశాధికారి వాసంశెట్టి రామారావు, దూదిపాల కోటేశ్వరరావు, సంఘం యువజన విభాగం అధ్యక్షుడు గడీల మధు, సీనియర్ జర్నలిస్ట్ కూరాకుల గోపీ,ఆకుతోట ఉపేందర్, సుంకరి పుల్లారావు,కమటం అప్పారావు,కానూరి కిరణ్ కుమార్,మడూరి శోభన్,బచ్చు నాగేందర్,ఆకుతోట రాము,పగడాల శ్రావణ్ కుమార్,కూరాకుల చిన్న సైదయ్య,పంచాది రంగారావు,కూరాకుల సైదయ్య (ఏస్ఐ),మంకెనపల్లి రాము,పాలెం రాజేష్,ఆకుల సురేష్,శ్రీకాంత్ తదితరులు భవ్యస్,ఆయన తల్లిదండ్రులు మోహన్-లలితలను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో కఠినమైన పరీక్షల్లో ఒకటైన సీఏలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపిన భవ్యస్ జీవితంలో ఉన్నతంగా ఎదిగాలని, తల్లిదండ్రులకు,పుట్టినగడ్డ గౌరవాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు.భవ్యస్ కు ఆకుల గాంధీ జ్ఞాపికను ప్రదానం చేసి ఆశీర్వదించారు.

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్.. ఎల్-2 లబ్దిదారులకు త్వరలో గృహాల కేటాయింపు

అంబర్‌పేటలో మహీంద్ర షోరూమ్‌లో అగ్నిప్రమాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *