బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

చల్లపల్లి ఘటన.. రక్షణ కోరిన బాధిత కుటుంబం

చల్లపల్లి ఘటన.. రక్షణ కోరిన బాధిత కుటుంబం

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్ధన్ ను కలిశారు. తమకు, తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వారు కోరారు.చల్లపల్లిలో తమ ఇంటిని కిరాయి మూకలతో ధ్వంసం చేయించారని, తన తల్లి ముప్పిరిశెట్టి రాణితో పాటు తమకు భద్రత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. దాడి చేసిన వారిని, దాడి చేయించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులు తమకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాపు జేఏసీని అభ్యర్థించారు.ఈ సందర్భంగా స్పందించిన చందు జనార్ధన్, చల్లపల్లి ఘటనలో ముప్పిరిశెట్టి రాణి కుటుంబానికి రాష్ట్ర కాపు జేఏసీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంటి ధ్వంసం, మూకుమ్మడి దాడి, హత్యాయత్నం ఘటనలపై బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేలా రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఆందోళన కొనసాగిస్తామని వారికి హామీ ఇచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్