బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి

అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. గన్నవరం లో జరిగిన కార్యక్రమంలో సీఎం బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేశారు.ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 చొప్పున జమ చేయగా, PM-KISAN పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2,000 జమ చేసింది. ఇలా మొత్తం రూ.6,000 రైతుల ఖాతాల్లోకి చేరాయి. సుమారు 6.85 లక్షల మంది రైతులకు ఈ నిధులు అందాయి. ఈ పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కో రైతుకు మొత్తం రూ.20,000 అందేలా ప్రభుత్వం అమలు చేస్తోంది.

డబ్బులు వచ్చాయా లేదా ఎలా చెక్ చేయాలి?

రైతులు తమకు డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని ఆన్‌లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రాసెస్ ఇలా ఉంటుంది:

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్
  1. Annadata Sukhibhava Portal వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  2. హోమ్‌పేజీలో Know Your Status ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ ఆధార్ నెంబర్ మరియు క్యాప్చా కోడ్ నమోదు చేయండి.
  4. Search బటన్‌పై క్లిక్ చేయండి.
  5. మీ పేమెంట్ స్టేటస్, ఈ-కేవైసీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అదే విధంగా Annadata Sukhibhava మొబైల్ యాప్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

డబ్బులు రాకపోతే ఏం చేయాలి?

ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు జమ కాకపోతే సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా గ్రామ/వార్డు సచివాలయంను సంప్రదించాలి. అదనంగా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ 155251ను అందుబాటులో ఉంచింది. ఈ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అర్హులైన రైతులందరికీ ఈ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఎన్.చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.