Breaking News

7న మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపిక పరీక్షలు: ఎండి. సలీం షరీఫ్ మండల విద్యాధికారి

కోదాడ, మార్చ్ 14. (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట, ఆదిలాబాద్, కరీంనగర్ మరియు హన్మకొండ నందు నాల్గోవ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయి ఎంపిక పరీక్షలు ఈనెల 17న ఉదయం 9 గంటలకు జడ్పీహెచ్ఎస్ కోదాడ పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. http://tgss.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా online లో పేరు నమోదు చేసుకున్న బాలబాలికలకు మండల స్థాయి ఎంపికలో భాగంగా మొత్తం 9 మోటార్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిలో 1. హైట్, 2.వెయిట్, 3. 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్, 4. 800 మీటర్ల పరుగు పందెం, 5. స్టాండింగ్ బోర్డ్ జంప్, 6. 6 X10 మీటర్ల షటిల్ రన్, 7. మెడిసిన్ బాల్ పుట్, 8. వర్టికల్ జంప్, 9. ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ ఉంటాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనపరిచిన పదిమంది బాలురు, 10 మంది బాలికలను జిల్లాస్థాయి ఎంపికలు పంపిస్తామని తెలిపారు. అర్హతగా 01-09-2017 నుంచి 31-08-2018 మధ్య జన్మించిన నాలుగో తరగతి విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, కుల దృవీకరణ పత్రం, ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ K. సునీల్ కుమార్ ( సెల్ నెం. 85007 12573 సంప్రదించాలని కోరారు.

తెలంగాణలో గృహ LPG కొరత లేదు.. కమర్షియల్ గ్యాస్‌కే సమస్య: మంత్రి ఉత్తమ్

రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ , లో వోల్టేజ్ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని బి.జీ.వినాయకుల ధర్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *