Breaking News

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

అమరావతి,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలు మార్చి 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారి కోసం 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈసారి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి హాల్‌టికెట్లపై ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్ ముద్రించారు. విద్యార్థులు తమ మొబైల్‌తో కోడ్‌ను స్కాన్ చేస్తే Google Maps ద్వారా పరీక్షా కేంద్రం లొకేషన్ నేరుగా కనిపిస్తుంది. దీంతో పట్టణ ప్రాంతాల్లో కేంద్రాలను వెతికే ఇబ్బంది తగ్గనుంది.

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నారు. హాల్‌టికెట్ చూపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లో పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు, తిరిగి ఇంటికి రావడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. పరీక్షలు జరిగే అన్ని రోజుల్లోనూ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.గతంలో అమల్లో ఉన్న కఠినమైన ‘నిమిషం నిబంధన’పై ఈసారి సడలింపు ఇచ్చారు. పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అనివార్య కారణాల వల్ల ఆలస్యమైతే పరీక్ష ప్రారంభమైన తర్వాత కూడా అరగంట వరకు లోపలికి అనుమతించాలని అధికారులు నిర్ణయించారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

పరీక్షల అనంతరం మూల్యాంకన ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు 26 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాల్లో మూల్యాంకనం జరుగుతుంది. మార్కుల నమోదులో పొరపాట్లు లేకుండా ఉండేందుకు ఈసారి ట్యాబ్లెట్ల ద్వారా మార్కులను నమోదు చేసే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 జవాబు పత్రాలను మాత్రమే మూల్యాంకనం చేసేలా నిబంధనలు విధించారు

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *