Breaking News

అసెంబ్లీలో నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర బడ్జెట్500 కోట్లు కేటాయించాలి

నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం.

జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలి

యాదగిరిగుట్ట : మార్చి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మకూరు మండలం సమావేశంలో బొల్లెపల్లి శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల బిక్షం మాట్లాడుతూ గత ఏడాది కాలంలో మార్చి బడ్జెట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నాయి బ్రాహ్మణులకు సంక్షేమానికి 30 కోట్లు అదేవిధంగా 100 కోట్లు కరెంటు సబ్సిడీ ప్రవేశపెట్టింది .ఏ మూలాన సరిపోని బడ్జెట్ అందుకని ఈసారి మార్చి బడ్జెట్లో నాయి బ్రాహ్మలకు, వాయిద్య కళాకారులకు , నాయి బ్రాహ్మణ మహిళకు , వృత్తి దార్ల నాయి బ్రాహ్మణులకు , సంక్షేమానికి 500 కోట్లు కేటాయించాలని అన్నారు . కరోనా వచ్చినప్పుడు నుండి ఇప్పటివరకు వృత్తి నడవక నానా ఇబ్బందులు పడి మారుతిలోనికి కార్పొరేట్ సెలూన్ రాకుండా అడ్డుకట్టు వేయాలని మాకు జీవో ఇవ్వాలని మా సంక్షేమానికి మా అభివృద్ధికి రుణాలు ఇవ్వాలి పెండింగ్లో ఉన్న విద్యుత్తు బకాయిలను వెంటనే చెల్లించాలి . భారీగా నష్టపోతున్న నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలి , ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టించి డబల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలి . ప్రభుత్వం మాకు ఇంకా 500 కోట్లు కేటాయించాలి వృత్తి శిక్షణ ఇవ్వాలి , మహిళలకు బ్యూటీ పార్ల రూ రూశిక్షణ ఇవ్వాలి , లక్ష రూపాయలు బీసీ బందు వృత్తిదారులు అందరికీ ఇవ్వాలి 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారుల కు పింఛన్ ఇవ్వాలి, ప్రభుత్వ హాస్టల్ హాస్పిటల్స్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలి , దేవస్థాన కళ్యాణ కట్ట లో పనిచేస్తున్న క్షరకు ల కు ప్రభుత్వం పర్మినెంట్ చేయాలి , తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ లో బార్ బార్ షాప్ నెలకొల్పాలి , గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న క్షవర వృత్తిదారులకు రక్షణ కట్టం కల్పించాలి , క్షవర వృత్తి దారులకు ప్రతి ఒక్కరికి ఐడెంటి కార్డు ఇవ్వాలి , ప్రతి హెయిర్ కటింగ్ షాపులలో పనిచేసే వృత్తిదారికి టెస్టులు మెడికల్ టెస్ట్లు ప్రభుత్వం చేయించాలిఈ కార్యక్రమంలో బొల్లపెల్లి శ్రీహరి, బండి నరేష్ , రాచమల్ల బలరాం , కృష్ణ , శ్రీహరి జే మ య కృష్ణ స్వామి , ఆర్ రవి వెంకటేష్ , అంజయ్య , విజయ్, మచ్చ గిరి , సత్తయ్య , మహేష్ , ఏపూరి ముగ్గురాముడు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు గుడ్‌న్యూస్.. ఈ నెల 22న రైతు భరోసా డబ్బులు ఖాతాల్లోకి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *