బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

భారత్‌కు చేరుకున్న LPG నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత

భారత్‌కు చేరుకున్న LPG నౌకలు.. తీరనున్న గ్యాస్ కొరత

మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): దేశంలోని గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఇటీవల భారత్‌లో నెలకొన్న ఎల్‌పీజీ కొరత త్వరలోనే తీరనుందని వెల్లడించింది. యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన LPG సరఫరా నౌకలు ఇప్పుడు సురక్షితంగా భారత తీరానికి చేరుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో శివాలిక్ అనే ఎల్‌పీజీ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నౌకలో సుమారు 48 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ నిల్వ ఉన్నట్లు సమాచారం. ఈ సరఫరాతో దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తగ్గే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా బుధవారం మరో ఎల్‌పీజీ నౌక కూడా ముంద్రా పోర్టుకు చేరుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వరుసగా నౌకలు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ రవాణాపై ప్రభావం పడినా, దేశంలో గ్యాస్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. దీంతో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ