బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

తిరుమల దర్శనం టికెట్లు… ఎప్పుడు బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇవే

తిరుమల దర్శనం టికెట్లు… ఎప్పుడు బుక్ చేసుకోవాలో పూర్తి వివరాలు ఇవే

తిరుపతి, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శుభవార్త తెలిపింది. జూన్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్స్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.జూన్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్ట్ దర్శనం టికెట్లు, అలాగే అంగప్రదక్షిణ టికెట్లు కూడా రిలీజ్ చేయబడతాయి.మరియు మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్లు విడుదల కానుండగా, అదే రోజు ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్ఠాభిషేకం వంటి సేవల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు మార్చి 18న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిప్ కోసం మార్చి 20న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. ఎంపికైన భక్తులు మార్చి 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు చెల్లింపులు పూర్తి చేస్తే టికెట్లు కన్ఫర్మ్ అవుతాయి.భక్తులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అనధికారిక వెబ్‌సైట్లు, దళారులను నమ్మవద్దని హెచ్చరించింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్