బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ క్లారిటీ.. టీవీకే కీలక ప్రకటన

ఎన్డీఏతో పొత్తుపై విజయ్ క్లారిటీ.. టీవీకే కీలక ప్రకటన

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం తన రాజకీయ స్టాండ్‌ను స్పష్టంగా వెల్లడించింది. ఎన్డీఏతో పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, పార్టీ కీలక నేత ఆధవ్ అర్జున్ స్పష్టత ఇచ్చారు.చెన్నైలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి టీవీకేకు భారీ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించారు. 90 అసెంబ్లీ స్థానాలు, అలాగే 2.5 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి కూడా ఆఫర్ చేసినట్లు తెలిపారు. మిగిలిన కాలంలో ఎడప్పాడి పళనిస్వామి సీఎం అవుతారని ప్రతిపాదన వచ్చినట్లు చెప్పారు.అయితే ఈ అన్ని ఆఫర్లను విజయ్ తిరస్కరించినట్లు అర్జున్ స్పష్టం చేశారు. “ఢిల్లీకి బానిసగా ఉండే సీఎం పదవి మాకు అవసరం లేదు” అంటూ విజయ్ స్పష్టంగా చెప్పారని తెలిపారు. అందుకే టీవీకే ఎలాంటి కూటమిలోనూ చేరకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుందని వెల్లడించారు.ఇక తమపై రాజకీయ ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, సినిమాలను కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.

రజనీకాంత్‌కు క్షమాపణలు

గతంలో రజనీకాంత్పై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆధవ్ అర్జున్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని పేర్కొంటూ, బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. విజయ్ కూడా రజనీకాంత్ అభిమానినే అని స్పష్టం చేశారు.మొత్తానికి, టీవీకే పార్టీ స్వతంత్రంగా పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ