బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నారా లోకేష్ ఉగాది కానుకగా ‘ఉద్యోగాల పండగ’ ప్రకటన

నారా లోకేష్ ఉగాది కానుకగా ‘ఉద్యోగాల పండగ’ ప్రకటన

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ‘ఉద్యోగాల పండగ’ను ప్రకటిస్తూ కీలక నిర్ణయం వెల్లడించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏ తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల అవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారో స్పష్టంగా పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి అన్ని పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాకుండా అభ్యర్థులు ముందుగానే సిద్ధం కావడానికి సిలబస్‌ను కూడా ముందుగానే ప్రకటించనున్నట్లు తెలిపారు.ఉద్యోగార్థులందరూ ‘నైపుణ్యం’ పోర్టల్‌లో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన అలర్ట్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు.ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉద్యోగాల ప్రకటనలు చేసే విధానాన్ని కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని పేర్కొంటూ, ఉద్యోగార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్