విజయవాడ. మార్చి 19 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నాలుగు దశాబ్దాలుగా జర్నలిజంలో సేవలందిస్తూ, ఈతరం జర్నలిస్టుకు మార్గదర్శి గా ఉపయోగపడే రెండు అరుదైన పుస్తకాలను రచించిన జర్నలిస్టు, రచయిత, కాలమిస్టు యేమినేని వెంకటరమణ, సాహిత్యాన్ని, జర్నలిజంలో ఆయన చేస్తున్న సేవల్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా ‘ఉగాది’ పురస్కారంతో సత్కరించింది. ఈ సందర్భంగా గురువారం విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చేతులమీదుగా ఉగా ది పురస్కారం అందుకున్నారు. యేమినేని వెంకట రమణ, ఈ పురస్కారాని కి రూ.10,000 రూపాయల నగదు, తెలుగుతల్లి జ్ఞాపిక, శాలువా, సర్టిఫికె ట్టు అందజేశారు. యేమి నేని సుబ్బారావు- యశోదమ్మ దంపతులకు ప్రస్తుత బాపట్ల జిల్లా యేమినే నివారిపాలెంలో 1962లో జన్మించిన వెంకటరమణ బియస్సీ చదివారు. 1979 లో తొలి కవితకు శ్రీకారం చుట్టారు. 2022 లో జర్నలిస్టుగా నా జ్ఞాపకాల సవ్వడి, 2025లో రమణీయం వంటి విలువైన పుస్తకాలు రాశారు. 1990లో విలేకరిగా ఆంధ్ర భూమిలో మొదలైన వెంకట రమణ, జీవన ప్రస్థానం నేటికీ జర్నలిజంలోనే కొనసాగుతోంది. ప్రస్తుతం వార్తాప్రభ దినపత్రికలో స్టేట్ బ్యూరోగా సేవలందిస్తున్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా, కృష్ణ వేణి స్విమ్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీగా కొనసాగుతు న్నారు. వివిధ జర్నలిస్టు సంఘాల్లో పని చేసిన యేమినేని వెంకటరమణ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్య దర్శిగా కొనసాగుతున్నారు. వేము సాహితీ సాంస్కృతిక సేవాసంస్థ నుండి ‘సృజనసామ్రాట్’, ‘సామాజిక సామ్రాట్’ బిరు దుల్ని పొందారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ‘జాతీయ సాంస్కృ తిక ఉత్సవా’ల్లో కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం నవమల్లెతీగ మాసప త్రికలో ‘రమణీయం’ కాల మిస్టుగా తన రచనలు కొనసాగిస్తున్నారు. యేమి నేని వెంకట రమణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా నవ్యాంధ్ర రచయితల సంఘం జనరల్ సెక్రెటరీ, మల్లెతీగ పత్రిక సంపాద కులు కలిమిశ్రీ, కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్ సీనియర్ జర్నలిస్టులు ఇస్కా రాజేష్ బాబు, అంతిమ తీర్పు ప్రసాద్ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
