Breaking News

చిరంజీవి వ్యాఖ్యలు – కళాకారులను గౌరవించే దేశం అభివృద్ధి చెందుతుంది

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం, దేశం బాగుపడుతుంది” అని ఆయన అన్నారు.మాదాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి, గద్దర్ అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. సినిమాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ప్రశంసించారు.

సామాజిక సందేశంతో కూడిన సినిమాలకు ప్రాధాన్యం – భట్టి విక్రమార్క

హైదరాబాద్‌లో సినిమా రంగానికి అవసరమైన అన్ని వసతులు ఉన్నాయని, దేశ సినీ పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో కే-పాప్‌, యానిమే లాంటి పరిశ్రమలు తమ దేశాల ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేస్తూ, తెలంగాణ కూడా ఆ దిశగా ఎదగాలని ఆకాంక్షించారు.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కూడా సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. గద్దర్ అవార్డుల ఎంపికలో సీనియర్ కళాకారులకు గౌరవం, యువతకు ప్రోత్సాహం కల్పించడం అభినందనీయమని తెలిపారు.మొత్తంగా ఈ వేడుక సినీ రంగానికి నూతనోత్సాహాన్ని నింపడమే కాకుండా, హైదరాబాద్‌ను భారతీయ సినిమా కేంద్రంగా మరింత బలపరిచే దిశగా అడుగులు వేస్తోందని భావిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కీలక ప్రకటన – గ్లోబల్ ఫిలిం హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *