Breaking News

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో “ఎంప్లాయిస్ హెల్త్ స్కీం” ప్రారంభాన్ని ప్రకటించారు.ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందుబాటులోకి రానుంది. ప్రతి లబ్ధిదారికి ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది. ఈ కార్డుల ద్వారా ఆసుపత్రుల్లో ఎలాంటి నగదు చెల్లించకుండా నేరుగా చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.ఈ స్కీం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమలవుతుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం పొందవచ్చు. దాదాపు 2,000 రకాల వ్యాధులకు చికిత్స అందించనున్నారు.ఇక వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ పరిసరాల్లోని సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో నిర్మిస్తున్న టిమ్స్ ఆసుపత్రులను త్వరలో ప్రారంభించనున్నారు. అలాగే NIMS లో అదనంగా 2,000 బెడ్ల నిర్మాణం జరుగుతోంది.

బెంగాల్‌లో బీజేపీ గెలుపు ప్రజల తీర్పు: కిషన్ రెడ్డి

అదేవిధంగా వరంగల్‌లో 24 అంతస్తులతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 2026 ఏప్రిల్ నుంచి సేవలు అందించనుంది. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా 6,582 కొత్త బెడ్లు అందుబాటులోకి రానున్నాయి.వైద్య విద్యలో కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తూ ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ స్కూల్స్, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించిందని తెలిపారు.మొత్తానికి, ఈ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య భద్రత లభించనుండగా, రాష్ట్ర వైద్య రంగం కూడా మరింత బలోపేతం కానుంది.

కేరళలో యూడీఎఫ్ ఘన విజయం.. రేవంత్ హర్షం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *