బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

ఆకెనపల్లిలో సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు

ఆకెనపల్లిలో సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు

బెల్లంపల్లి, మార్చి 20 (నేటి తెలుగు పత్రిక): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సంసిద్ధమయ్యారు. గ్రామంలో ప్రతిఏటా సీతారాముల కల్యాణ వైభోగాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. గ్రామమంతా ఏకతాటిపై నిలబడి ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా చేపడతారు. ఈసారి కూడా గ్రామంలో వైభవోపేతంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని నిర్వహించేందుకు గ్రామస్తులు అన్ని చర్యలు చేపడుతున్నారు. స్థానికంగా ఉన్న పాత బెల్లంపల్లి, బుచ్చయ్యపల్లి, లింగాపూర్, శాంతిఖని ప్రాంతాల నుండి గ్రామంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి చందాలు సేకరిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులకు త్రాగునీటి సౌకర్యంతో పాటు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి