బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

వాత్సల్యమూర్తి భువనమ్మపై నిర్మాత అట్లూరి నారాయణరావు ప్రశంసలు

వాత్సల్యమూర్తి భువనమ్మపై నిర్మాత అట్లూరి నారాయణరావు ప్రశంసలు

హైదరాబాద్‌, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయం కోసం తాను చేసిన మొక్కు నెరవేరిందని సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు తెలిపారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి ఆత్మీయతను ఆయన హృదయపూర్వకంగా కొనియాడారు. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి ఆహ్వానం మేరకు కుటుంబ సమేతంగా ఆమెను కలిసిన అట్లూరి నారాయణరావు, ఆమె చూపిన వాత్సల్యానికి భావోద్వేగానికి లోనయ్యారు. “భువనమ్మ ఆదరణతో మా జీవితం ధన్యమైంది” అని అన్నారు.గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఘనవిజయం సాధించాలని కోరుకుంటూ, తన కోరిక నెరవేరితే మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో శాశ్వత రథాన్ని సమర్పిస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆ మేరకు కోటి రూపాయల వ్యయంతో రథాన్ని తయారు చేసి సమర్పించినట్లు చెప్పారు.ఆ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరు కాలేకపోయినప్పటికీ, తరువాత తనను గుర్తు పెట్టుకుని కుటుంబంతో కలిసి ఇంటికి ఆహ్వానించి ఆత్మీయంగా పలకరించడం తనకు మరపురాని అనుభూతిగా నిలిచిందన్నారు.అలాగే నారా రోహిత్ చేతుల మీదుగా రథ సమర్పణ జరిగినట్లు వివరించారు. భువనమ్మ చూపిన ప్రేమ, గౌరవం తమ కుటుంబానికి చిరస్మరణీయమని అట్లూరి భావోద్వేగంతో తెలిపారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి