బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు

నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి, మార్చి 21, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల నిజమైన ఉగాది పండుగలా మారిందని వ్యవసాయ మంత్రి నిరుద్యోగులకు అసలైన ఉగాది: మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.అమరావతిలో ఆయన మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన 10,060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్ యువతలో కొత్త ఆశలు నింపిందన్నారు. ఇది నిరుద్యోగులకు పెద్ద కానుకగా నిలిచిందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒకవైపు పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షిస్తూ, మరోవైపు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే సుమారు 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు, అలాగే గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, విద్యాశాఖల్లో షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా గత వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జాబ్ క్యాలెండర్ పేరిట యువతను మోసం చేశారని ఆరోపించారు.మొత్తంగా, రాష్ట్ర యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రిపరేషన్ ప్రారంభించాలని, తమ లక్ష్యాలను సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్