Breaking News

ప్రైవేట్ మోజు వద్దు.. ప్రభుత్వ పాఠశాలలే బెస్ట్: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: ప్రైవేటు విద్యపై మోజు పడకుండా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు.సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్వహించిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేశారు. అనంతరం ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. జిల్లాలో సుమారు రూ.775 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, రాష్ట్రంలో లక్షకు పైగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, 18 వేల ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్” ప్రారంభిస్తామని, నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్య అందించనున్నట్లు చెప్పారు.

నర్మెట్ట రైతు ఉత్సవాల్లో సీఎం సందడి.. 150 స్టాళ్ల పరిశీలన: రేవంత్ రెడ్డి

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని కూడా అమలు చేస్తామని వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలకంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన బోధన అందుతుందని స్పష్టం చేశారు.ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం వస్తుందనే భావన తప్పని, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవడం ముఖ్యమని సీఎం సూచించారు. ఏటీసీల్లో చదివే విద్యార్థులకు ప్రతి నెల రూ.2,000 స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పలు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సిద్దిపేటలో భారీ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *