బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల కీలక పాత్ర: రేవంత్ రెడ్డి

మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాసవీ అమ్మవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు వెన్నెముక లాంటి వారని, అభివృద్ధి, సంస్కృతి రంగాల్లో వారి భాగస్వామ్యం విశేషమని అన్నారు.

ఆర్యవైశ్య సమాజానికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ రికార్డు సాధించడం అభినందనీయమని కొనియాడారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రస్తావించిన సీఎం, శాంతి మార్గంలో సాధించిన విజయాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు కూడా అదే క్రమశిక్షణతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు.ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి ఆర్యవైశ్య ప్రతినిధులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి