బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
భక్తి

ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాల వైభవం.. కనకదుర్గమ్మకు పుష్పార్చన

ఇంద్రకీలాద్రిపై వసంతోత్సవాల వైభవం.. కనకదుర్గమ్మకు పుష్పార్చన

విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం లో వసంతోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కనకదుర్గమ్మను మందార పుష్పాలు, ఎర్ర కలువలు, చామంతి పూలతో అద్భుతంగా అలంకరించారు. పుష్పాల సువాసనతో ఆలయ ప్రాంగణం పరిమళించగా, భక్తులు అమ్మవారి అలంకారాన్ని దర్శించి భక్తి పరవశంలో మునిగిపోయారు.

ఆలయ కార్యనిర్వహణాధికారి స్వయంగా పుష్పార్చన నిర్వహించగా, వైదిక కమిటీ సభ్యులు, స్థానాచార్యులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వసంతోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ భిన్న రకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నారు.వసంతోత్సవాల నేపథ్యంలో ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనాలను సజావుగా నిర్వహిస్తున్నారు.

శ్రీవారికి భారీ కానుక.. విద్యుత్ బస్సు, ట్యాబ్‌ల విరాళం