బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

దక్షిణాది పాత్ర తగ్గిపోతుంది.. లోక్‌సభ పునర్విభజనపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

దక్షిణాది పాత్ర తగ్గిపోతుంది.. లోక్‌సభ పునర్విభజనపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా చర్యలు తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఉన్న లోక్‌సభ స్థానాల నిష్పత్తిని కొనసాగిస్తూ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని సూచించారు. 50 శాతం మేర సీట్లు పెంచే ప్రతిపాదన అమలు చేస్తే, భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలను ఆయన What India Thinks Today Summit 2026లో చేశారు. TV9 Network ఆధ్వర్యంలో జరిగిన ఈ సమ్మిట్‌లో పలు జాతీయ అంశాలపై స్పందించారు.లోక్‌సభ పునర్విభజన వంటి కీలక అంశంపై ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. ముందుగా నిర్ణయం తీసుకుని తర్వాత చర్చలు నిర్వహించడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు.

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు సుహృద్భావంగా ఉండాలని కోరుతూ, పెద్ద రాష్ట్రాల ఆధిపత్యం పెరిగితే చిన్న రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్రం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.లోక్‌సభ పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో కీలక చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి