బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
తెలంగాణ

సిరిసిల్ల నేతన్నలపై విద్యుత్ భారాలు.. మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి వినతి

సిరిసిల్ల నేతన్నలపై విద్యుత్ భారాలు.. మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి వినతి

సిరిసిల్ల, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ బకాయిలు, సర్‌చార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులను కలిసి వినతి పత్రం అందజేశారుసిరిసిల్లలోని పవర్‌లూమ్ యూనిట్లపై విధించిన విద్యుత్ బకాయిలు, ముఖ్యంగా ‘బ్యాక్ బిల్లింగ్’ భారంతో పరిశ్రమ కుదేలవుతోందని వివరించారు. గతంలో 25 హెచ్.పి వరకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేసిందని పేర్కొన్నారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్‌ఎస్‌ఐ యూనిట్లపై రూ.19 కోట్ల బకాయిలు విధించగా, సర్‌చార్జీలతో కలిపి అది రూ.38 కోట్లకు చేరిందని తెలిపారు. ఈ భారీ భారం చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తీవ్రంగా కలిచివేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో మానవీయ కోణంలో ఈ బకాయిలను మాఫీ చేసి నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం అవుతోంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి