Breaking News

పార్లమెంట్‌లో భారీ బిల్లులకు సిద్ధం.. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.మహిళా రిజర్వేషన్‌ను 2029 నుంచి అమలు చేసేలా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం వ్యూహరచన చేస్తోంది. ఇందుకోసం ఆర్టికల్ 55, ఆర్టికల్ 81, ఆర్టికల్ 82, ఆర్టికల్ 170, ఆర్టికల్ 330, ఆర్టికల్ 332 వంటి రాజ్యాంగంలోని పలు అంశాల్లో సవరణలు చేయనున్నట్లు తెలుస్తోంది.పార్లమెంట్‌లో కీలక బిల్లులు ప్రవేశపెట్టి రాజకీయంగా కూడా ముందడుగు వేయాలని కేంద్రం భావిస్తోంది. మొత్తంగా, ఈ కేబినెట్ భేటీ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే నిర్ణయాలకు వేదిక కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *