కోదాడ, మార్చి 26(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో. నర్సింహా పురం నుంచి ఆర్లెగూడెం రోడ్డు కు. ఇరువైపులా. ఉన్న కంపచెట్లను. పెంట దిబ్బలను. జేసీబి సహాయంతో. గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠదామం వరకు శుభ్రం చేయించడం జరిగింది. అలాగే నర్సింహా పురం నుంచి రామాపురం ( కె) కట్టకొమ్ము గూడెం. రోడ్డుకు ఉన్న కంప చెట్లను తొలగించడం. జరిగింది. ఇలా కంప చెట్లతో ఉండటం వల్ల ఆయా గ్రామాల కు వెళ్లే వాహన దారులకు. ద్విచక్ర వాహన దారులకు ఇబ్బందులు తొలగిపోతాయి అని. గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభ లో. వివిధ రకాల అభివ్రుద్ది కార్యక్రమాలపై చర్చించామని. రాబోయే వేసవి కాలంలో ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని. అలాగే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా ఉపయోగించుకోవాలని. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని. అన్నారు. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి. ప్రజలంతా భాగస్వామ్యం కావాలని. అలాగే. దాతలు ముందుకు వచ్ఛి గ్రామంలో సీసీ కెమెరాలు . గ్రంథాలయం. ఇతరత్రా సౌకర్యాల కల్పనకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రెడ్డెబోయిన ప్రశాంత్. వార్డు సభ్యులు షేక్ అజిజ్ మియా. మీసాల బిక్షం. పంచాయతీ కార్యదర్శి. వెంకటేశ్వర్లు. గ్రామస్తులు. వీరబోయిన వినోద్ కిన్నెర శ్రీను. సండ్ర లింగయ్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
