Breaking News

గృహ వినియోగదారులకు గుడ్‌న్యూస్… ₹500 వరకు ఫ్రీ గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ జీరో

న్యూఢిల్లీ, మార్చి 27, నేటి తెలుగు పత్రిక: గృహ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వినియోగాన్ని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్తగా PNG కనెక్షన్ తీసుకునే వారికి ₹500 విలువైన గ్యాస్‌ను ఉచితంగా అందించనుంది. అంతేకాకుండా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. LPG (సిలిండర్ గ్యాస్)పై ఆధారపడటాన్ని తగ్గించి, PNG వినియోగాన్ని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారాన్ని తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి సుజాత శర్మ వివరాల ప్రకారం, PNG సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో LPG వినియోగదారులకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమాచారం పంపనున్నారు. అలాంటి వినియోగదారులు PNGకి మారేందుకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు.ఇక దేశవ్యాప్తంగా PNG విస్తరణను వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. గత 25 రోజుల్లోనే సుమారు 2.5 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపింది. ముఖ్యంగా Delhi వంటి నగరాల్లో పైప్‌లైన్ పనులను 24 గంటలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. రోడ్డు పునరుద్ధరణ ఛార్జీలను కూడా రద్దు చేశారు.

అయోధ్యలో అద్భుతం… రామ్ లల్లాకు సూర్య తిలకం

ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న LPG కొరత వార్తలను కేంద్రం ఖండించింది. దేశంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని స్పష్టం చేసింది. సరఫరా పూర్తిగా స్థిరంగా ఉందని పేర్కొంది. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు తెలిపింది.అంతర్జాతీయంగా కూడా భారత్ చురుకైన దౌత్య చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చలు జరిపినట్లు సమాచారం. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్ ప్రతినిధులతో భేటీ అయ్యి పరిస్థితులను సమీక్షించారు.మొత్తానికి, దేశంలో ఇంధన భద్రతను పెంచడం, వినియోగదారులకు భారం తగ్గించడం లక్ష్యంగా కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది.

అమెరికా నుంచి భారత్‌కు తిరిగి రానున్న 9వ శతాబ్ధానికి చెందిన 3 పురాతన శిల్పాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *