Breaking News

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్… కొత్త మెనూ విడుదల

మార్చి 27, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు “ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం”ను 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్త రూపంలో అమలు చేయనుంది.ఈ పథకం ద్వారా ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు చదివే సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం టిఫిన్‌తో పాటు పాలు లేదా రాగి జావ అందించనున్నారు. వారంలో ఆరు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ అందించబడుతుంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రోజువారీ మెనూ ఇలా

  • సోమవారం: దోసె-చట్నీ / చపాతీ-కర్రీ
  • మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబారు
  • బుధవారం: పూరి-ఆలూ కుర్మా
  • గురువారం: మిల్లెట్ ఇడ్లీ-సాంబారు
  • శుక్రవారం: మిల్లెట్ ఉప్మా / పొంగల్-చట్నీ
  • శనివారం: బోండా-చట్నీ

టిఫిన్‌తో పాటు మూడు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందిస్తారు. విద్యార్థులు ప్రశాంతంగా భోజనం చేసేందుకు ప్రతిరోజు 45 నిమిషాల సమయం కేటాయించనున్నారు.ఈ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం రూ.720 కోట్ల వ్యయాన్ని అంచనా వేసింది. ఇందులో పాఠశాల విద్యార్థుల కోసం రూ.540 కోట్లు, పాల సరఫరా కోసం రూ.180 కోట్లు కేటాయించగా, ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.56 కోట్లు మంజూరు చేశారు. రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తమిళనాడులో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరచడం, హాజరు శాతం పెంచడం, చదువుపై దృష్టి పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *