బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్

కృష్ణాజిల్లా ఎస్పీని కలిసిన రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్
  • ముప్పిరిశెట్టి రాణి ఇల్లు ధ్వంసం ఘటనపై న్యాయం చేయాలని వినతి

మచిలీపట్నం, 27 మార్చి 2026, నేటి తెలుగు పత్రిక: కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడును రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. చల్లపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. చల్లపల్లి అగ్రహారంలో నివసించే ముప్పిరిశెట్టి రాణి ఇంటిని.. అదే గ్రామానికి చెందిన కుట్ర దారులు కిరాయి గుండాలను నియమించుకుని, మారణాయుధాలు, డ్రిల్లింగ్ యంత్రాలతో ధ్వంసం చేయించారు. బాధితురాలిని హత్య చేసి, ఆమె ఇంటిని కబ్జా చేసే కుట్రతో నిందితులు ఈ దాడికి తెగబడ్డార ని ఈ విధ్వంసకాండకు పాల్పడినవారిని, కుట్రపూరితంగా దాడిలో పాల్గొన్న కిరాయి గూండాలను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలి కి కుటుంబానికి ప్రాణహాని ఉందని, వారి కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచారు.రాష్ట్ర కాపు జేఏసీ తరఫున బాధిత కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని చందు జనార్దన్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్