బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
ఆంధ్రప్రదేశ్

శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!

శ్రీరామనవమి పురస్కరించుకుని అజిత్ సింగ్ నగర్‌లో భారీ అన్నదాన కార్యక్రమం!

విజయవాడ (మార్చి 27)నేటి తెలుగు పత్రిక: శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో డి.ఎస్ లక్ష్మీ జగన్నాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు ఆలయాల్లో భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కృష్ణ జిల్లా మరియు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల ఆరోగ్యం, విద్య మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఫౌండేషన్, నేడు భరతమాత మందిరం రోడ్డు (భారత్ గ్యాస్ గోడౌన్ సమీపంలో) వద్ద ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. శ్రీరామనవమి వేడుకలకు విచ్చేసిన భక్తులకు మరియు సాధారణ ప్రజలకు ఫౌండేషన్ తరపున మధ్యాహ్న భోజనం మరియు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డి.వి.ఎస్. లోకేశ్వర రావు పాల్గొని మాట్లాడారు. అనాథలు, పేద మహిళలు, పిల్లల ప్రకాశవంతమైన భవిష్యత్తు కోసం, వారి సంక్షేమం కోసం తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు ఎస్. మురళీ మోహన్, ప్రధాన కార్యదర్శి చల్లా బాల సుబ్రహ్మణ్య సాయి రామ్ మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్