యాదగిరిగుట్ట : మార్చి 26 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): నిన్న గురువారం సాయంత్రం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని 32 వార్డు తారకరామ్ నగర్ లో నివాసం ఉంటున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు సందెల శ్రీనివాస్ గారి మనవడు ప్రియనష్, వీధి కుక్కల దాడికి గురై పూర్తిగా కుడి కన్ను గాయమై కింద పడిపోయి అతి దారుణంగా జరిగిన సంఘటన, భాదకారం , ఇలాంటి సంఘటన రాష్ట్రంలో జరగటం ఒక మర్చిపోలేని బాధాకరమైన సంఘటన అని ఈరోజు బోనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి స్వయంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలుని చూసి ఆసుపత్రి వైద్యబృదo తో మాట్లాడి బాలునికి పూర్తిగా వైద్యం అందించాలని, ‘పూర్తిగా చికిత్స అందించే’ బాధ్యత నాది అని ఎమ్మెల్యే’ తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యమిచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని, గ్రామాలలో పట్టణంలోని అన్ని వార్డులలో, పునరావృతం కాకుండా అధికారులు మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమయం ఎమ్మెల్యే గారి తో భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రేఖ బాబురావు, భువనగిరి మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు క నకుంట్ల కొండల్, గుమిడెల్లి రమేష్, బాలస్వామి, నల్గొండ ప్రభాకర్, మచ్చనవీన్, మైలారం సుదర్శన్, కనుకుంట్ల సురేష్, తదితరులు కలిసి కుటుంబంనకు, ధైర్యాన్నిచ్చి బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశాభవం వ్యక్తం చేశారు.
